అల్లు అర్జున్ బాటలో యష్….

yash movie updates

సినిమాలు తీసి హిట్లు కొట్టడమే కాదు మరో విషయంలో కూడా నార్త్ ఆడియన్స్ కి భలే నచ్చేస్తున్నారు మన దక్షిణాది హీరోలు. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప, యష్ కేజీఎఫ్ 2 సినిమాలు చూసి నార్త్ ఆడియన్స్ ఫిదా అవగా ఇప్పుడు వారు తీసుకున్న నిర్ణయానికి కూడా వారంతా హ్యాపీ ఫీలవుతున్నారు. అయితే ఏమిటి ఆ నిర్ణయం ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చూస్తే…
అల్లు అర్జున్ అర్జున్ అల వైకుంఠపురంలో అలాగే పుష్ప లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అల వైకుంఠపురంలో సినిమా సంగతి పక్కన పెడితే పుష్పా సినిమా మాత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా నార్త్ లో కూడా ఆయనకు మంచి అభిమాన గణాన్ని సంపాదించిపెట్టింది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శేషాచలం అడవుల నేపథ్యంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ఒక వ్యక్తి ఒక డాన్ గా ఎలా ఎదిగాడు అనే పాయింట్ మీద తెరకెక్కించారు. ఈ సినిమా నార్త్ లో కూడా మంచి విజయాన్ని సాధించింది.ఇక ఏమీ లేని ఒక వ్యక్తి ఎలా ఒక గోల్డ్ మైన్స్ ను స్వాధీనం చేసుకున్నాడు అనే కధతో కేజిఎఫ్ 2 సినిమా రూపొందింది. యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి అద్భుతమైన విజయాన్ని సాధించింది. హిందీలో పుష్ప సినిమా రికార్డులు దాటేసి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే దిశగా ముందుకు కదులుతోంది. ఇప్పటికే బాహుబలి ప్రభాస్ కు నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడగా ఆయన తర్వాత అల్లు అర్జున్ కి ఇప్పుడు యష్ కు కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో యష్ క్రేజ్ ను వాడుకోవడం కోసం ఒక పాన్ మసాలా కంపెనీ సిద్ధమైంది. తమ కంపెనీ పాన్ మసాలాను ప్రమోట్ చేస్తే కోట్ల రూపాయల మేర డబ్బులు ఇస్తామని ఆయనకు ఆఫర్ చేసింది. గతంలో అదే విధంగా అల్లు అర్జున్ కోసం కోట్ల రూపాయల మేర ఆఫర్ వచ్చినా సరే ఆయన నేను పొగాకు ఉత్పత్తులను వాడను, అలాగే వేరే వాళ్ళు వాడాలని కోరుకోను అని చెబుతూ ఆ కోట్ల రూపాయలు తోసిపుచ్చారట.ఇక ఇప్పుడు యష్ కూడా అదే బాటలో పయనిస్తూ తాను పొగాకు ఉత్పత్తులు వాడటం విషయంలో ఎలాంటి ప్రకటన చేయనని అది తనకు కరెక్ట్ కనిపించడం లేదని చెబుతూ కోట్ల రూపాయల ఆఫర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం యష్ డేట్లు చూస్తున్న ఒక కంపెనీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇక కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గారు. ఆయన ఒక పాన్ మసాలా కంపెనీ కోసం కొన్ని కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుని దానిని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు.అయితే అనూహ్య పరిస్థితుల్లో ఆయన మీద విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో తాను చేసే పని కరెక్ట్ కాదని భావించిన ఆయన సోషల్ మీడియా వేదికగా ఇకమీదట ఇలాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించను అని దాని నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద అల్లు అర్జున్ యష్ ల వ్యవహారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*