KCR : త్యాగాల ఫలితం తెలంగాణ: కేసీఆర్

KCR

KCR : త్యాగాల ఫలితం తెలంగాణ: కేసీఆర్

KCR : ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ  దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి KCR : ఆవేదన వ్యక్తం చేశారు.

1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు.

ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని వెల్లడించారు.  ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం.

పోరాడి సాధించుకొన్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగిడుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన రాష్ట్రం కేవలం తొమ్మిదేండ్లలోనే లక్ష్యాలకు మించిన ప్రగతితో దూసుకుపోతున్నది.
2014, జూన్ 2 తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసారు.

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో అగ్రగామిగా నిలిపేందుకు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయి.

వ్యవసాయం, విద్యుత్తు, తాగు, సాగునీరు, పల్లె, పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్యం, పారిశ్రామికం, ఐటీ, ఆర్థిక ప్రగతి.. ఇలా ప్రతిరంగం విజయాన్నీ ప్రతిబింబించేలా ఈ రోజున తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది.

తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వం..ప్రజల భాగస్వామ్యంతో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శవంతంగా నిలిచాయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తిని వ్యక్తం చేశారు.

హైదరాబాద్ మూలంగా ఐటీ రంగానికి ప్రాధాన్యమిస్తూ, పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడే ఫార్మా, టెక్స్‌టైల్ రంగాలను వివిధ జిల్లాల్లో అభివృద్ధి చేసే ప్రయత్నం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు ప్రవేశ పెట్టారు. షెడ్యూల్ కులాలవారికి సాధికారత సాధించే దిశలో ఆర్థిక సహాయం అందించడం దీని ఉద్దేశం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. విశ్వనగరం గా బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వైట్ హౌస్ లాంటి సచివాలయం సిద్దమవుతున్న అమరవీరుల స్థూపం మెట్రో విస్తరణ నగరంలో ఎక్కడిక్కడ ఫ్లై ఓవర్లు..వేగంగా విస్తరిస్తున్న ఓఆర్ఆర్ వంటివి నగర ప్రతిష్టను పెంచాయి.

జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పాడ్డాక తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కరెంట్ కష్టాలకు చరమ గీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ మారిందని కేసీఆర్ అన్నారు.

దేశంలో 24 గంటలు విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని తెలిపారు.

గురువారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం KCR :  ప్రసంగించారు. అంతకుముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

గన్ పార్క్‌లోని తెలంగాణ అమరుల స్తూపం వద్ద ఆయన నివాళులు అర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్స్ చేరుకున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh