ఎత్తర జెండా పాటలో ఉన్న జెండా కథ తెలుసా

The Story Behind The Etthara Jenda Song Flag In RRR Movie

RRR సినిమా లోని నెత్తురు మరిగితే ఎత్తర జెండా  పాటలో రాంచరణ్ ఎన్టీఆర్ చాల చోట్ల ఒక జెండాను పట్టుకొని కనిపిస్తారు. ఆ జెండాను చూసి ఎదో పాటకోసం  ఆ జెండాను డిజైన్ చేసి ఉంటారు ఏమో అని అనుకుంటారు, కానీ నిజం ఏంటంటే దాని వెనుక ఒక చరిత్ర ఉంది.

ప్రస్తుతం మన భారతదేశ జెండా ఎలా ఉందొ మన అందరికీ తెలుసు. కానీ మీరు RRR సినిమాలో ఆ పాట లో చూసిన ఆ జెండానే  మన భారత దేశపు మొట్టమొదటి జెండా.  ఇండియన్ ఫస్ట్ unofficial ఫ్లాగ్. ఈ మొదటి  భారతదేశపు జెండాని 1906 లో ఆగష్టు 7న కలకత్తా లో పార్సీ భాగ్  స్క్వేర్  అనే గ్రీన్ పార్క్ లో ఎగురవేశారు. ఈ జెండా లో ఆకుపచ్చ ,పసుపు , ఎరుపు , రంగులతో కూడిన మూడు సమానా చారలు ఉన్నాయి .. పైన ఆకుపచ్చ రంగు పై 8 కమలాల గుర్తులు , పసుపు పై వందేమాతరం అని, ఎరుపు పై చందమామ సూర్యుడు గుర్తులు ఉన్నాయి .. ఈ జెండాను కేవలం ఒక సంవత్సరం మాత్రం ఉపయోగించారు .. ఆ తరువాత 1907 లో మల్లి కొన్ని రంగుల మార్పుతో తయారు చేసి ప్యారిస్ లో ఎగురవేశారు (కాషాయం ,పసుపు,ఆకుపచ్చ ) ఇది కూడా unofficial జెండానే.

ఆ తరువాత 1917 మూడవ భారతీయ జెండాను మల్లి తయారుచేసారు ఆ తరువాత భారతదేశపు జెండాను 1921 లో ఎగురవేశారు . ఇది మూడోవ ఆఫీసియల్ ఫ్లాగ్ గ చెప్పొచ్చు . ఇది 1921 లో విజయవాడ లో అఖిల భారత కాంగ్రేస్ కమిటీ సమావేశం జరుగుతున్నప్పుడు ఒక ఆంధ్ర యువకుడు ఈ జెండాను తయారుచేసి గాంధీజీ వద్దకు తీసుకు వెళ్ళాడు అయితే అప్పుడు ఆ జెండాలో రెండు రంగులు మాత్రమే వున్నాయి ఎరుపు మరియు ఆకుపచ్చ ఉన్నాయి, అంటే ఎరుపు హిందువులకు, ఆకుపచ్చ రంగు ముస్లింలకు చిహ్నంగా తయారుచేస్తే గాంధీజీ అప్పుడు దానికి తెలుపు రంగు జోడించారు.ఆ తెలుపురంగు  మిగిలిన మతాల వారికి గుర్తుగా వారిని కూడా జోడించినట్లు ఈ తెలుపును చేర్చారు … అలాగే స్పిన్నింగ్ వీల్ ను కూడా జాతిపురోగతికి గుర్తుగా చేర్చారు, ఇది 4వ జెండా.

ఆ తరువాత 1931 లో అంటే 10సంవత్సరాల తరువాత భారత దేశపు 5వ జెండాను మరికొన్ని మార్పులతో రూపొందించారు . ఎరుపు రంగు కి బదులుగా కాషాయం రంగును, రంగుల స్థానాలను మార్చారు . ఆ తరువాత 6వ జెండా ను 1942 సం. జులై లో ఇప్పుడు చూస్తున్న జెండాను విడుదల చేసారు. ఈసారి మధ్యలో ఈ స్పిన్నింగ్ వీల్ కి బదులుగా  అశోక చక్రాన్ని రీప్లేస్ చేసారు అప్పట్లో కాంగ్రేస్ పార్టీ కోసం రుపొంచిన జెండాననే  నేడు మన భారత దేశానికి త్రివర్ణ పతాకంగా నిలిచింది . rrr సినిమాను రాజమౌళి 1920 వ దశకంలో స్టోరీ గా చూపించారు కాబట్టి అప్పట్టి భారతీయ జెండాను ఆ పాటలో చూపించారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*