ఎన్టీఆర్ అసలు రిహార్సల్స్ కి రారు.. అయినా ఒకే దెబ్బకు.. శేఖర్ మాష్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Shekar Master Comments On NTR

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమాని నిరంతరం వార్తల్లో ఉంచే విధంగా రెండు రోజులకు ఒకసారి ఒక టెక్నీషియన్ని మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యేలా చేస్తున్నారు సినిమా నిర్మాతలు.. ఇప్పటికే ఈ సినిమా కోసం పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, దర్శకుడు పరశురామ్, కీర్తి సురేష్ ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇప్పుడు సినిమాకి కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శేఖర్ మాస్టర్ కూడా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా మరిన్ని విషయాలు ఆయన పంచుకున్నారు.

సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్, ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడిన అనంతరం మే నెల 12వ తేదీన విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమా విడుదల నేపథ్యంలో తాజాగా శేఖర్ మాస్టర్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.

ఈ క్రమంలో ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. సినిమాకు ఈ సినిమాలో డ్యాన్స్ బాగుంటుంది అని కొరియోగ్రాఫర్లు చెప్పడమే కానీ ఫ్యాన్స్ మాత్రం సాటిస్ఫై అవ్వడం లేదు కదా అని ప్రశ్నిస్తే ఈ సినిమాలో డ్యాన్స్ ఖచ్చితంగా బాగుంటుంది అని అయితే అది ఫ్యాన్స్ కి ఏ రేంజ్ లో నచ్చుతుంది అనే విషయం చూడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి రామ్ చరణ్ కలిసి ఉన్న సాంగ్ ఆ రేంజ్ లో రాలేదని ఒక ఫీలింగ్ ఉంది అంటే మనం పాటలో ఎవరు డాన్స్ చేస్తున్నారు అనేదాన్ని ఎంతగా చూడాలో పాటను కూడా అంతగానే అర్థం చేసుకోవాలని పాటను బట్టి డాన్స్ ఉండాలి కానీ అందులో ఉన్న వ్యక్తులను బట్టి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇక మన హీరోలలో తక్కువ శాతం రిహార్సల్స్ చేసే వాళ్ళు ఎవరు అంటే ఎన్టీఆర్.ఆయన అయితే ఇప్పటిదాకా రిహార్సల్స్ కి కూడా రారు ఆయన నేరుగా సెట్స్ కి వచ్చి ఒక్కసారి చూపించగానే దాన్ని అవగతం చేసుకుని పాటలో లీనమై పోతారు అని చెప్పుకొచ్చారు. ఇక తమ అభిమాన హీరో గురించి ఈ కామెంట్స్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సర్కారు వారి పాట సినిమా నుంచి రాబోతున్న ఒక మాస్ సాంగ్ గురించి చెబుతూ ఆ సాంగ్ చాలా బాగా వచ్చిందని సాంగ్ లో మహేష్ గారు చాలా బాగా చేశారు అని ఆయనతో పనిచేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మనం సాటిస్ఫై అయినా సరే ఒకవేళ సాటిస్ఫై కాకపోతే మరోసారి చేద్దామని ఆయన అంటారని ఎక్కడా కూడా వెనకడుగు వేసే మనిషి కాదని చెప్పుకొచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*