సర్కారు వారి పాట లేపేస్తున్నారా

Sarkaru vari pata

మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది.. ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది అనుకుంటున్న ఒక పాటను ఏకంగా తీసివేయాలని ఈ సినిమా యూనిట్ భావిస్తోంది.సరిలేరు నీకెవ్వరు లాంటి సాలిడ్ హిట్ తర్వాత మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. బ్యాంకింగ్ మోసాలు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, మహేష్ బాబుకు సంబంధించిన ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ల మీద ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు..ఎప్పుడో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేయగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన సినిమా యూనిట్ అందులో భాగంగానే ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన ఏఎస్ ప్రకాష్ చేత వరుస ఇంటర్వ్యూలు ఇప్పించింది.ఆయన దాదాపు రెండు మూడు రోజులపాటు వార్తల్లో నిలిచారు. ఆయన డ్యూటీ అయిపోగానే ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ డ్యూటీ ఎక్కారు.

ఈ సినిమా గురించి మార్తాండ్.కె.వెంకటేష్ కూడా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రెండు మూడు రోజుల పాటు ఆయన పేరు అలాగే సినిమా పేరు కూడా ప్రజల నోళ్లలో నానుతూనే ఉంటుంది. ఇక ఆయన తర్వాత కీర్తి సురేష్ వంతు.అలా ఒకరి తర్వాత ఒకరు సినిమాలు వార్తల్లో ఉంచేలాగా ప్లాన్ చేసింది సినిమా యూనిట్. అదలా ఉంచితే మొదట అనుకున్న దానికి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత అనుకుంటున్న దానికి చాలా కనిపిస్తున్నాయని తెలుస్తోంది.నిజానికి మొదట కళావతి సాంగ్ ఆ తర్వాత సితార కనిపించిన పెన్ని సాంగ్ విడుదల చేసిన తర్వాత ఒక మురారి బావ అనే పాట విడుదల చేయాలని సినిమా యూనిట్ భావించింది. అయితే ఇప్పుడు ప్రమోషన్ స్ట్రాటజీ మార్చుకున్న నేపథ్యంలో మురారి బావ స్థానంలో సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ విడుదల చేశారు. దాని తర్వాత అయినా ఆ సాంగ్ విడుదల చేస్తారా అంటే ట్రైలర్ అలాగే ఒక మాస్ సాంగ్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అలా మురారి బావ అనే సాంగ్ వెనక్కి వెళుతూ వెళుతూ వచ్చింది.

తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాని మేరకు అసలు పూర్తిగా ఆ పాటను తొలగించాలని సర్కారు వారి యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. అయితే అందుతున్న information మేరకు సర్కారు వారి పాట యూనిట్ మురారి బావ అనే సాంగ్ చిత్రీకరించడం కోసం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట.అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఆ పాటలు పెట్టాలా? వద్దా? అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ పాట సినిమాలో ఎక్కడ పెడితే సూట్ అవుతుంది అని డైరెక్షన్ టీమ్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ సాంగ్ ప్లేస్ మెంట్ కోసం కరెక్ట్ ప్లేస్ దొరకకపోతే కచ్చితంగా ఈ పాటను పక్కన పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.ఇది ఇలా ఉంటే…మరోవైపు సినిమా కు సంబంధించినవి ఏవైనా అఫీషియల్ గా విడుదల చేయకముందే సోషల్ మీడియాలో లీక్స్ అవుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఇప్పుడు ట్రైలర్ కూడా లీక్ అవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా నటిస్తున్నాడు.సర్కారు వారి పాట తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఇదివరకే కొన్ని అప్డేట్స్ తో క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కళావతి పాట ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పాటలు అఫీషియల్ గా విడుదల చేయడం కంటే ముందే సోషల్ మీడియాలో లీకయ్యాయి.

పాటలు అలా లీక్ కావడంతో ఆ విషయంపై సంగీత దర్శకుడు థమన్ కాస్త అప్సెట్ అయ్యాడు. మరొకసారి ఇలాంటి పొరపాటు ఏమాత్రం జరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా అన్నారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మళ్లీ లీక్స్ కొనసాగుతూనే ఉన్నాయి.. థమన్ చెప్పిన తర్వాత మరొక పాట కూడా అఫీషియల్గా విడుదల చేయడం కంటే ముందే సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది.ఇక సోమవారం రావాల్సిన ట్రైలర్ కూడా ముందే సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్లుగా తెలుస్తోంది.ట్రైలర్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ఎడిటింగ్ జరుగుతున్నప్పుడే మొబైల్ తో వీడియో తీసుకున్నరట. ప్రస్తుతం ఎక్కువగా మహేష్ బాబు చేతిలో తాళాల గుత్తి పట్టుకునే విలన్స్ ను కొడుతున్న సీన్ వైరల్ గా మారుతోంది.

ఒక్క సర్కారు వారి పాట విషయంలోనే ఇలా తరచుగా ఎందుకు జరుగుతోంది అనేది ప్రస్తుతం ప్రేక్షకుల్లో కూడా అనేక రకాల సందేహాలను కలిగిస్తోంది. ఒకసారి లీక్ అయితే మరోసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఆ విషయంలో పెద్దగా ఫోకస్ చేయడం లేదు అని అనిపిస్తోంది. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోక పోతే మొదటికే మోసం వస్తుంది అని రేపు సినిమాకు సంబంధించిన సన్నివేశాలు కూడా విడుదలకు ముందే లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*