నేను ఉన్నాను.. నేను విన్నాను’ డైలాగ్ ఎందుకంటే..?

sarkaru-vari-pata-dailogue

స‌ర్కారు వారి పాట‌ లో… డైలాగుల్ని కుమ్మ‌రించేశాడు ప‌ర‌శురామ్‌. స్వ‌త‌హాగా ర‌చ‌యిత కాబ‌ట్టి… త‌న పంచ్ ప‌వ‌ర్‌, పెన్ ప‌వ‌ర్ చూపించేశాడు. ఎక్కువ డైలాగులు మాసీగానే ఉన్నాయి. అయితే.. అందులో `నేను ఉన్నాను.. నేను విన్నాను` డైలాగ్ మాత్రం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఈ డైలాగ్ ఎందుకు రాయాల్సివ‌చ్చిందో.. కార‌ణం ఇప్పుడు చెప్పుకొచ్చాడు ప‌ర‌శురామ్‌. “నాకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆయ‌న‌కు హీరో వర్షిప్ ఉండేది. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన `నేను ఉన్నాను.. నేను విన్నాను` అనే పొలిటిక‌ల్ డైలాగ్ నాకు చాలా ఇష్టం. చాలా అర్థం ఉంది అందులో. ఎంత పెద్ద భావాన్ని.. ఇంత చిన్న ముక్క‌లో భ‌లే చెప్పారు అనిపించింది. అలాంటి సంద‌ర్భం స‌ర్కారు వారి పాట‌ లో ఒక‌టి వ‌చ్చింది.

క‌థానాయిక కీర్తి సురేష్‌కి అలాంటి భ‌రోసానే హీరో ఇవ్వాల్సివ‌చ్చిన‌ప్పుడు ఈ డైలాగ్ ప‌ర్‌ఫెక్ట్ గా స‌రిపోతుంద‌నిపించింది. స్క్రిప్టు రాస్తున్న‌ప్పుడే ఈ డైలాగ్ ఉంది. మ‌హేష్ కూడా ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. ఎలాంటి డిస్క‌ర్ష‌న్ లేకుండా.. సెట్లో ఈ డైలాగ్ ఓకే అయిపోయింది“ అని చెప్పుకొచ్చారు ప‌ర‌శురామ్‌. ఈనెల 12న స‌ర్కారు వారి పాట‌ విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత‌.. నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*