100కోట్ల క్లబ్ లో సర్కారువారి పాట.. Sarkaru vaari Paata Movie Sucess Meet || Mahesh Babu || Keerthy Suresh

sarkaru vaari paata 100 crores sucess meet

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ బ్లాక్ బస్టర్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గా విడుదల అయ్యి భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో మేకర్స్ ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ వేడుకలని విజయవాడలో చేస్తున్నట్టుగా నిన్న అనౌన్స్ చేశారు.మరి ఈ సినిమా సక్సెస్ పై ఒక భారీ ఈవెంట్ ని చేస్తున్నట్లు గా ఇప్పుడు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మే 16 సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్ విజయవాడలో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్నారు. దీనితో ఈ సక్సెస్ మీట్ కోసం అభిమానులు మంచి ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు మళ్ళీ ఈ వేడుకల వేదికని మార్చినట్టుగా మేకర్స్ తెలిపారు. కర్నూల్ ఎస్ టి బి సి కాలేజ్ గ్రౌండ్స్ లో అదే మే 16న సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు…. ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే..

ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదట ఈ సినిమా కాస్తా మిక్సుడ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయినా కలెక్షన్స్ మాత్రం మొదటి రోజు ఓ రేంజ్’లో అందుకోగా,.. సినిమా రెండో రోజు మాత్రం కాస్తా తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓ రేంజ్‌లో దుమ్ము లేపిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*