ఆచార్య ఎఫెక్ట్‌తో అలర్ట్ అయిన టక్కరి దొంగ

Maheshbabu Sarkaru Vaari Paata Movie Updates

ప్రస్తుతం దక్షిణాదిలో ఎక్కడ లేనట్టు తెలంగాణలో సినిమా టిక్కెట్ రేట్స్ భారీగా పెంచారు. దీంతో హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఈ టికెట్ రేట్స్ చూసి సినిమా చూడాలా వద్దా అనే ఆలోచనలో పడుతున్నారు. ఏదో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలకు ఇప్పటికే పెరిగిన ధరలకు తోడు.. అదనంగా రూ. 100, 50 రూపాయలు పెంచిన ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరించారు. కానీ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమాకు కూడా తెలంగాణలో ఒక వారం, ఏపీలో పది రోజుల పాటు ఉన్న టికెట్ రేట్స్‌కు అదనంగా 50 రూపాయలు పెంచుకునేందుకు ఆయా సర్కారులు అనుమతులు ఇచ్చాయి.

ఈ టికెట్ రేట్స్ హైక్ అనేవి ఆచార్య కొంప ముంచాయి. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడం వంటి కారణాలు ఏమైనా ముందు నుంచి ఈ సినిమాపై ముందుగా ఉన్న అంచనాలు ఆ తర్వాత క్రమ క్రమంగా సన్నగిల్లాయి. దీంతో ప్రేక్షకులు ఆచార్యను లైట్ తీసుకున్నారు. ట్రైలర్ కూడా పెద్దగా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించలేదు. ఇక ఈ సినిమాలో తండ్రీ తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ అనగానే అభిమానులు, ప్రేక్షకులు ఎగేసుకొని వస్తారనుకున్నారు. పైగా టికెట్ రేట్ 50 రూపాయలు పెంచిన పెద్దగా ఎఫెక్ట్ పడదని అనుకున్నారు. తీరా ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే.. అంతగా రెస్పాన్స్ రాలేదు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా టాక్ ను బట్టి థియేటర్స్ వైపు రావాలని డిసైడ్ అయ్యారు. ఇక ఈ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో అప్పటికే ఈ సినిమా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. పైగా ప్రేక్షకులు.. ఎక్కువ రేటుకు ఎంతో కాలంగా ఎదురు చూసిన రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ భారీ రేటుకు థియేటర్స్‌లో చూసారు. ఆ తర్వాత కేజీఎఫ్‌ 2ను ఫ్యామిలీ ఆడియన్స్ కాకుండా మాస్ ప్రేక్షకులు ఆదరించారు. ఆయా సినిమాలకు టికెట్ రేట్స్ పెంచినా పెద్దగా పట్టించుకోలేదు. అదే ఆచార్య విషయానికొస్తే.. ఈ చిత్రంలో ఆసక్తిగొలిపే అంశాలేవి మేకర్స్ ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. పైగా టికెట్ రేట్స్ ఎక్కువగా ఉండటంతో హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను పెద్దగా పట్టించుకున్నట్టు లేదు.

ఆచార్య సినిమా ఫలితం చూసిన మహేష్ బాబు తన అప్ కమింగ్ ప్రాాజెక్ట్ ’సర్కారు వారి పాట’ సినిమా కోసం టికెట్ రేట్స్ పెంచకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పైగా ఈ సినిమా గురువారం విడుదల కాబోతుంది. సినిమాకు ఏ కాస్త తేడా వచ్చినా.. అంతే సంగతులు. పైగా తెలంగాణలో ఇప్పటికే మల్టీప్లెక్స్‌లో రూ. 295 భారీ రేటు ఉంది. దీనికి అదనంగా 50 రూపాయలు జోడించే వంటి కార్యక్రమాలు చేస్తే మొదటికే మోసం వస్తుందనే కారణంతో మహేష్ బాబు .. ఇపుడున్న రేట్స్ భారీగా ఉన్న నేపథ్యంలో మాములుగా విడుదల చేయమని ఆదేశించినట్టు సమాచారం.మొత్తంగా ఆచార్య సినిమా ఎఫెక్ట్‌తో మహేష్ బాబు.. ఇపుడు సర్కారు వారి పాట సినిమా విషయంలో టిక్కెట్స్ పెంచవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా ఆచార్య ఎఫెక్ట్ మహేష్ బాబు‌ను భయపెట్టిందనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*