Mothers Day: తమ తల్లులతో ఫొటోలు షేర్ చేసిన సెలబ్రిటీలు

Mothers Day

 

Mothers Day: తమ తల్లులతో ఫొటోలు షేర్ చేసిన సెలబ్రిటీలు

Mothers Day: అమ్మ ప్రేమను వివరించ లేము. త్యాగానికి చిరునామా అమ్మ. కనిపించే దైవం అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవం అని చెప్పొచ్చు.

నవమాసాలు మోసి కష్ట పడి అమ్మ జన్మనివ్వడం ఒక ఎత్తయితే… రెక్కలు ముక్కలు చేసుకుని సరైన దారిలో పెట్టి ఎంతో కష్ట పడేది అమ్మ. ఇలా మీరు ఈ స్థాయిలో ఉండడానికి కారకురాలైన అమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నా తక్కువే అవుతుంది.

ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు ప్రపంచ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాము. నిజానికి మదర్స్ డే వెనుక ఎంతో పెద్ద చరిత్ర ఉంది. గ్రీస్‌లో రియా అనే ఒక దేవతను మదర్ ఆఫ్ ద గాడ్స్‌గా భావించి ప్రతి ఏడాదికి ఒక సారి నివాళులర్పించే వారు.

Also Watch

Jabardasth Rohini: కాలిలో రాడ్ ఉండిపోయి హాస్పిటల్ లో నటి

17వ శతాబ్దంలో అయితే ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా మదర్ సండే పేరిట ఉత్సవాలు జరిపే వారు.

అదే 1872 లో అయితే జూలియ వర్డ్‌ హోవే అనే ఒక మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని జరిపించారు.

మదర్స్ ఫ్రెండ్షిప్ డేని జరిపేందుకు అన్న మేరీ జర్విస్‌ అనే మహిళ ఎంతో కృషి చేశారు. 1905 మే 9న ఆమె చనిపోగా ఆమె కుమార్తె మిస్ జర్విస్ మాతృ దినోత్సవం కోసం ఎంత గానో ప్రచారం చేయడం జరిగింది.

అమెరికాలో అన్ని రాష్ట్రాలలో మాతృ దినోత్సవాన్ని 1911 నాటికి జరపడం మొదలైంది. అధికారికంగా 1914 నుంచి దీనిని జరిపించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు.

ఇలా అప్పటి నుంచి కూడా మే రెండో ఆదివారం నాడు మదర్స్ డే ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే నిన్న (మే 14)నఅంతర్జాతీయ మాతృ దినోత్సవం సంధర్బం గా  మాతృదినోత్సవం ను ప్రపంచవ్యాప్తంగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇక మన సెలబ్రిటీలు కూడా పలువురు వాళ్ళ అమ్మతో ఉన్న అనుబంధాలను షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో అమ్మతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసారు.

దీంతో ఈ ఫొటోలు, పోస్టులు వైరల్ గా మారాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh