కొండవీటిసింహం సినిమా మధ్యలోనే చిరంజీవిని తీసి మోహన్ బాబుని ఎందుకు పెట్టారు?

kondaveeti simham

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి కొన్ని ప్రత్యేక పేజీలు ఉన్నాయి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. పరిశ్రమలో కొనసాగుతూ ఉన్నారు.అంతే కాకుండా 30 సంవత్సరాలుగా మెగాస్టార్ గా ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన యువ నటీనటులకు ఆరాధ్య దైవంగా మారారు. ఎందరో తమ గుండెల్లో దేవుడిగా చిరంజీవిని కొలుస్తున్నారు అంటే నమ్మవలసిందే.ఆనాడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎవ్వరూ తనకు బాసటగా నిలవలేదు.అయినా తన స్వశక్తితో టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోగా అవతరించడంలో ఎన్నో కష్టాలు మరియు బాధలు అనుభవించాడు.అయితే ఈ రోజు మన కంటికి కనిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఊరికే అయిపోలేదు.

పునాది రాళ్ళు మూవీ నుండి ఇంకొద్ది రోజుల్లో థియేటర్ లో విడుదల కానున్న ఆచార్య మూవీ వరకు ప్రతి సినిమా ప్రత్యేకమే.తన సినిమాలో స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ వంటి వాటికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి చిరంజీవి కూడా కెరీర్ తొలి రోజుల్లో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి.వాటిలో ఒక సంఘటన గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం.

అప్పట్లో తెలుగు సినిమాను ముందుకు తీసుకు వెళ్తున్న సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, నాగేశ్వరరావు, శోభన్ బాబు వారి కాలంలో జరిగిన ఘటన. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా కొండవీటిసింహం చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ కు కొడుకుగా చేసే పాత్రలో చిరంజీవిని తీసుకున్నారు దర్శక నిర్మాతలు.అప్పటికే కొన్ని సినిమాలతో చిరంజీవి లైమ్ లైట్ లోకి వస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఒక వైపు జరుగుతోంది.ఇందులో చిరంజీవి పోలీస్ అయిన తండ్రి ఎన్టీఆర్ నే ఎదిరిస్తూ ఒక విలన్ లా చేయాల్సిన పాత్ర.అయితే చిరంజీవికి ఎన్టీఆర్ మీద ఉన్న ప్రత్యేక గౌరవంతో ఆ పాత్ర చేయడానికి మనసులో అంగీకారంగా లేడు.కానీ ఈ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పలేడు.ఒకవేళ చెబితే ముందే కథ తెలుసు కదా.అంటూ అడిగే అవకాశం ఉంది.అందుకే ఏమి చెయ్యాలో ఆలోచిస్తున్నాడు.కానీ చిరంజీవి చెప్పక ముందే ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు పసిగట్టారు.కొన్ని రోజులు వీరిద్దరి మధ్య సీన్ లు షూట్ చేయడంతో. చిరంజీవి ఎన్టీఆర్ ను ఉద్దేశించి డైలాగ్ లు చెప్పలేక భయపడుతున్నాడు.ఎన్టీఆర్ ముందుకు వస్తూ ఉంటే చిరంజీవి వెనక్కు వెళుతున్నాడు.

ఇది గమనించిన దర్శక నిర్మాతలు ఇతని స్థానంలో అప్పటికే ఎన్టీఆర్ తో సింహబలుడు సినిమాలో విలన్ గా చేసి సక్సెస్ అయిన మోహన్ బాబు ను పెట్టీ సినిమా కంప్లీట్ చేశారు.అలా కొండవీటి సింహం లో చిరంజీవి చేయాల్సిన పవర్ ఫుల్ పాత్రను మోహన్ బాబు చేశాడు.ఈ సినిమా తర్వాత మోహన్ బాబుకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.అలా చిరంజీవి కెరీర్ లో ఒకే ఒక్క సినిమాలో తాను చేయలేక తప్పుకోవలసి వచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*