చెర్రీ స్పీడ్ కి బ్రేకుల్లేవ్!

Ramcharan Shankar Movie Updates

ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా తండ్రి చిరంజీవితో కలిసి `ఆచార్య`తో ప్రేక్షకులను పలకరించాడు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ అభిమానులు మరియు ప్రేక్షకుల అంచనాలను టచ్ కూడా చేయలేకపోయింది. తొలి షో నుంచే ఈ మూవీ నెగటివ్ టాక్ ను మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో అనౌన్స్ చేసింది.ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్ నవీన్ చంద్ర అంజలి జయరామ్ సునీల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు శిరీష్ లు కలిసి హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఫస్ట్ షెడ్యూల్ ను పూణేలో పూర్తి చేసుకుంది.రెండొవ షెడ్యూల్ ఏపీ రాష్ట్రంలోని రాజమండ్రి కాకినాడ కొవ్వూరు ప్రాంతాల్లో జరగగా.. మూడో షెడ్యూల్ ను పంజాబ్ లోని అమృత్సర్ లో కంప్లీట్ చేసుకుని వచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. `ఆర్సీ 15` నెక్స్ట్ షెడ్యూల్ కు కూడా మేకర్స్ ఆల్ సెట్ చేసేశారట.

మే 5 నుంచి ఈ చిత్రం కొత్త షెడ్యూల్ విశాఖపట్నంలో స్టార్ట్ కాబోతోందని.. అక్కడ చెర్రీతో సహా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.మొత్తానికి చరణ్ శంకర్ తో కలిసి బ్రేకులు లేకుండా జెట్ స్పీడ్ తో `ఆర్సీ 15` షూటింగ్ ను పూర్తి చేస్తుండటంతో.. మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. అంతేకాదు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఓ పాత్ర పొలిటీషియన్ అయితే.. మరో పాత్ర ఐఏఎస్ ఆఫీసర్ అని అంటున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా మూవీకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*