శివ పూజలో రామ్ చరణ్..Ramcharan Shiva Pooja With Upasana Konidela

Ramcharan In Shiva Pooja

ఈ మ‌ధ్య మ‌న హీరోల‌కు ఆధ్యాత్మిక చింత‌న ఎక్కువైంది. సినిమాల్లో ఎంత స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నా.. మామూలు ప‌రిస్థితుల్లో ఎంత మోడ్ర‌న్‌గా ఉన్నా భ‌క్తి భావం విష‌యంలో అస్స‌లు త‌గ్గేదే లే అని అంటున్నారు మ‌న అగ్ర క‌థానాయ‌కులు.

ముఖ్యంగా మెగా హీరో అయిన రామ్ చ‌ర‌ణ్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్ర‌తి ఏడాది అయ్య‌ప్ప‌స్వామి మాల వేస్తుంటారు. రీసెంట్ టైమ్‌లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా స‌క్సెస్ త‌ర్వాత కూడా ఆయ‌న మాల వేసుకుని ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న విష‌యాన్ని మ‌నం గ‌మ‌నించి ఉండొచ్చు.

ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముందో తెలుసా! రామ్ చ‌ర‌ణ్ ప‌ర‌మేశ్వ‌రుడి ఆల‌యంలో ఉన్నారు. ఆల‌యంలో శివ లింగాన్ని నీటితో శుద్ధి చేస్తున్నారు. కొన్ని సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో చూసిన నెటిజ‌న్స్ ‘‘సూప‌ర్ స్టార్ డ‌మ్‌కి సింప్లిసిటీ ఓ ట్రేడ్ మార్క్. రామ్ చ‌ర‌ణ్ ప‌లువురు సెల‌బ్రిటీల‌కు రోల్ మోడ‌ల్‌’’ అంటున్నారు.

రామ్ చ‌ర‌ణ్ అనే కాదు.. ఈ మ‌ధ్య కాలంలో మ‌న స్టార్ హీరోలు త‌మ భ‌క్తి భావాన్ని చాటుకుంటున్నారు. దీక్ష‌లు చేస్తున్నారు. రీసెంట్ టైమ్‌లో ఎన్టీఆర్ .. ఆంజ‌నేయ స్వామి దీక్ష‌ను చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి దీక్ష‌ను చేశారు. నితిన్ కూడా ఆంజ‌నేయ స్వామి దీక్ష చేశారు.ఇక రామ్ చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే .. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఆయ‌న శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలోనూ యువీ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఓసినిమా చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*