
సౌత్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న రజనీకాంత్ ఒకప్పుడు వరుస విజయాలతో దేశంలోనే అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోగా కూడా గుర్తింపు అందుకున్నారు. ఇప్పుడు ఆయన రేంజ్ కు తగ్గట్టుగా దర్శకులు సినిమాలు చేయమపోవడంతో కమర్షియల్ గా సక్సెస్ రేట్ చాలా వరకు తగ్గింది. కానీ అప్పట్లో రజనీకాంత్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీసు వద్ద ఒక రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసేవి. ఇక రజనీకాంత్ కెరీర్ లో ఎన్ని సినిమాలు ఉన్న కూడా అందులో పడయప్ప(నరసింహా)టాప్ లో ఉంటుంది అని చెప్పాలి. ఇక దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ సినిమా కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 1999లో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో చేసినటువంటి పడాయప్ప సినిమా ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాను తెలుగులో నరసింహ టైటిల్ తో విడుదల చేశారు. ఇక ఈ సినిమా తమిళంలో ఎలాంటి విజయాన్ని సాధించిందో అదే తరహాలో తెలుగులో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు రజనీకాంత్ క్రియేట్ చేసిన పాత రికార్డులను కూడా ఆ సినిమాలో బ్రేక్ చేయడం విశేషం.
అంతేకాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను సొంతం చేసుకుని రజనీకాంత్ మార్కెట్ ను ఒక్కసారిగా పెంచేసింది. వరుస విజయాలతో అప్పట్లో మంచి ఊపు మీద ఉన్న దర్శకుడు కేఎస్ రవికుమార్ రజనీకాంత్ తో నరసింహ సినిమా కంటే ముందు ముత్తు అనే సినిమాతో బాక్సాఫీస్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక మళ్ళీ వీరి కలయికలో సినిమా అనగానే విడుదలకు ముందే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
ఇక దర్శకుడు నరసింహ కంటే ముందు మరో కథను కూడా చెప్పాడు. కానీ రజనీకాంత్ ఆ ప్రాజెక్ట్ ఒకే చేయడానికి ఒప్పుకోలేదు. సింగిల్ సిట్టింగ్లో పడాయప్ప కథ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచిపోయిన కూడా ఇప్పటికీ అందులోని సన్నివేశాలు పాత్రలు ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు.
ముఖ్యంగా రజనీకాంత్ హీరోయిజానికి తగ్గట్టుగా రమ్యకృష్ణ చూపించిన విలనిజం సినిమాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది. నీలాంబరిగా రమ్యకృష్ణ పాత్ర అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. రజనీకాంత్ రమ్యకృష్ణ కు సంబంధించిన రెండు పాత్రల సన్నివేశాలు ఆల్ టైం బెస్ట్ సీన్స్ అని చెప్పవచ్చు.
అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి తరహా హీరో విలన్ సినిమా రాలేదు అని చెప్పాలి. ఇక సరిగ్గా 23 ఏళ్ల తర్వాత నరసింహ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రాబోతున్నట్లు సమాచారం రమ్యకృష్ణ, రజినీకాంత్ చేయబోయే తదుపరి సినిమాలో పవర్ఫుల్ లేడి విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇదివరకే ఈ దర్శకుడు రజనీకాంత్ తో సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక నెగిటివ్ రోల్ కోసం రమ్యకృష్ణ ను సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి వీరి సినిమా రిలీజ్ కావచ్చని టాక్. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Leave a Reply