
కొన్ని సార్లు యాదృశ్చికంగా జరిగేవి సర్ప్రైజింగ్గా ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్, మహేష్‌బాబు విషయంలో అదే జరుగుతుంది. రాజమౌళితో సినిమా ఇద్దరి సేమ్ నెంబర్ కావడం విశేషం. దీంతో నెక్ట్స్ కూడా సంచలనమే అంటున్నారు ఫ్యాన్స్. రాజమౌళి(SSRajamouli)తో ఎన్టీఆర్(NTR) చేసిన `ఆర్ఆర్ఆర్`(RRR Movie) సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల విజయవంతంగా రన్ అవుతుంది. రామ్‌చరణ్‌తో కలిసి తారక్ నటించిన ఈ సినిమా రూ.1100కోట్లు దాటి 1200కోట్ల దిశగా రన్ అవుతుంది.
`కేజీఎఫ్2` రావడంతో ఈ సినిమా కలెక్షన్లు పడిపోయాయి. అయితే `ఆర్ఆర్ఆర్` ఎన్టీఆర్‌కి 29వ సినిమా కావడం విశేషం. మరోవైపు రాజమౌళి(Rajamouli) నెక్ట్స్ మహేష్‌బాబు (Maheshbabu)తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇది ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. అడ్వెంచరస్ ఫిల్మ్ గా స్టయిలీష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించబోతున్నారు. దీంతోపాటు మరో ఒకటి రెండు స్టోరీస్ కూడా ఉన్నాయని అంటున్నారు. మరి మహేష్-రాజమౌళి(Mahesh-Rajamouli Movie) కాంబినేషన్లో ఏ సినిమా రాబోతుందనేది ఆద్యంతం ఆసక్తికరంగా మారింది.
రాజమౌళి `ఆర్ఆర్ఆర్` నుంచి పూర్తిగా రిలీఫ్ అయ్యారు. ఇప్పుడు మహేష్ సినిమాపై ఫోకస్ పెట్టారు. Mahesh కూడా తాను నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్ర షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన షార్ట్ వెకేషన్‌కి దుబాయ్ వెళ్లారు. ఆయనతోపాటు రాజమౌళి కూడా వెళ్లారని, అక్కడ వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకి సంబంధించిన కథా చర్చలు జరగబోతున్నాయని తెలుస్తుంది. ఇక్కడే వీరి సినిమా స్టోరీని ఫైనల్ చేయబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే మహేష్ చేస్తున్న `సర్కారు వారి పాట` ఆయనకు 27వ చిత్రం. త్రివిక్రమ్‌తో చేసేది 28వ సినిమా. రాజమౌళితో సినిమా 29వది కావడం విశేషం. ఇదే ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది.
ఎన్టీఆర్‌తో చేసిన 29వ చిత్రం `ఆర్ఆర్ఆర్` దుమ్మురేపింది. మహేష్‌తోనూ సేమ్ నెంబర్ సినిమాని రాజమౌళి చేస్తుండటంతో తారక్‌కి వర్కౌట్ అయినట్టే అదే మ్యాజిక్ మహేష్‌కి కూడా వర్కౌట్ కాబోతుందని భావిస్తున్నారు. అదే జరిగితే నిజంగానే అదో సంచలనంగా మారబోతుందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. యాదృశ్చికంగా సెట్ అయితే ఈ `29` నెంబర్ సెంటిమెంట్, తారక్‌కి లాగే మహేష్‌కి కలిసొస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ విషయంలో సర్ప్రైజింగ్గా ఉన్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ మాత్రం అప్పుడే మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటూ లెక్కలేస్తున్నారు. దీనికితోడు మరికొత్త యాంగిల్‌ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్లాగే మహేష్‌కి కూడా వరుసగా ఆరు హిట్లు పడబోతున్నాయని జోస్యం చెబుతున్నారు. అంతకు ముందు వరుస పరాజయాలతో ఉన్న ఎన్టీఆర్‌కి `టెంపర్`తో హిట్ వచ్చింది. అప్పటి నుంచి వరుసగా ఆరు చిత్రాలు `నాన్నకు ప్రేమతో`, `జనతా గ్యారేజ్`, `జై లవ కుశ`, `అరవింద సమేత`, `ఆర్ఆర్ఆర్` విజయాలు సాధించాయి. ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు ఆయన కొరటాలతో `ఎన్టీఆర్30` చేస్తున్నారు..అలాగే మహేష్‌కి `భరత్ అనే నేను`తో హిట్లు స్టార్ట్ అయ్యాయి. `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` హిట్ అయ్యాయి. ఇప్పుడు `సర్కారువారిపాట`పై కూడా నమ్మకం ఉంది. `గీతగోవిందం` ఫేమ్ పరశురామ్ తీస్తున్న సినిమా కావడం హిట్ పక్కా అంటున్నారు. దీంతోపాటు త్రివిక్రమ్‌తోనూ చేయబోయే సినిమా సైతం హిట్ రాసిపెట్టుకోవాల్సిందే అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆ తర్వాత రాజమౌళితో సినిమా గురించి వేరే చెప్పక్కర్లేదట. `ఆర్ఆర్ఆర్`ని మించి అంటున్నారు. దీంతో ఆరు హిట్లు ఖాయం.
మరి యాదృశ్చికంగా 29వ సినిమా రాజమౌళితో ఎన్టీఆర్‌కి `ఆర్ఆర్ఆర్` సెట్ అయినట్టు, ఇప్పుడు మహేష్‌కి రాజమౌళితో `SSMB29` సినిమా సెట్ అయ్యింది. సక్సెస్ కూడా అదే స్థాయిలో వస్తున్నారు భావిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఏం జరుగుతుంది? మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా? అనేది చూడాలి.
Leave a Reply