రాజమౌళి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా హీరోయిన్ ??

Rajamouli Next movie

RRR దర్శకుడు SS రాజమౌళి తన మనస్సులో రెండు మహిళా ఆధారిత కథలు ఉన్నాయని వెల్లడించారు. రాజమౌళి ప్రస్తుతం హ్యాపీ మ్యాన్. రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్- అలియా భట్ – అజయ్ దేవగన్ లతో చేసిన భారీ ప్రయోగం ఆర్.ఆర్.ఆర్ పెద్ద సక్సెసైంది. బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత అతడు చేపట్టిన ప్రతిదీ పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలుగా మారుతున్నాయి. ఇండియా నంబర్ -1 డైరెక్టర్ గా రాజమౌళి పేరు మార్మోగుతోంది. ఇకపై ఆయన ఎలాంటి సినిమాలు చేస్తారు? అన్నదానిపైనా వాడి వేడిగా చర్చ సాగుతోంది.

తాజా చిట్ చాట్లో SS రాజమౌళి ఒక ఆసక్తికర విషయం వెల్లడించారు. RRR గురించి ఈ సినిమా వెనుక అతని ఆలోచనలు.. అలియాతో తన విబేధాలు.. అతని భవిష్యత్ ప్రాజెక్ట్ ల గురించి ఓపెనవుతూ ఆ ఆసక్తికర విషయాన్ని లీక్ చేశారు. .. తన ప్రాజెక్ట్ల గురించి మాట్లాడుతూ.. రాజమౌళి తన దృష్టిలో రెండు నాయికా ప్రధాన కథలు ఉన్నాయని వెల్లడించాడు.

మీరు ఎప్పుడైనా మహిళా ప్రధాన చిత్రం చేస్తారా? అని ప్రశ్నిస్తే.. SS రాజమౌళి ఏమన్నారంటే.. “ఫీమేల్-సెంట్రిక్ ఫిల్మ్ తీయడం గురించి ప్రత్యేకంగా ఆలోచనల్ని పంచుకున్నారు “నా మైండ్ లో చాలా ఆసక్తికరమైన లేడీ ఓరియెంటెడ్ లైన్స్ ఉన్నాయి. స్త్రీ ప్రాధాన్యతతో రెండు లైన్లు ఉన్నాయి. ఒకటి కేరళ-కర్ణాటక ప్రాంతానికి చెందిన రాణి అబ్బక్క గురించి. ఆమె గురించి చాలా మందికి తెలియదు. కానీ ఆమెకు అద్భుతమైన చరిత్ర ఉంది. ఇది భారీ యాక్షన్ తో చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

ఎక్కువ వీరోచిత క్షణాలు ఉంటాయి. రెండోది సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశం. ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉందని నా స్నేహితుల్లో ఒకరు చెప్పారు. ఇది కూడా నాయికా ప్రధాన కథతో సాగుతుంది. ప్రస్తుతం ఆ లైన్స్ నా మనసులో కూడా నడుస్తాయి. కానీ నేను చెప్పినట్లు.. రాసే సమయంలో ఏ లైన్ నా హృదయాన్ని ఆకర్షిస్తుందో నేను దానితోనే సెట్స్ పైకి వెళ్తాను…“ అని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*