బన్ని ‘పుష్ప 2’కి బిగ్ బ్రేక్

pushpa 2 movie shooting postponed

పుష్ప 2 గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వినాల్సొస్తోంది. ఈ మూవీ ఆరంభం గురించి రకరకాల ప్రచారం సాగుతోంది. ఇదిగో పులి అంటే అదిగో మేక! అన్న చందంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు పుష్ప 2 షూట్ ఆగిపోయింది అంటూ బ్రేకింగ్ వార్తలు దర్శనమిస్తున్నాయి. KGF- చాప్టర్ 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత ఇక ఏ సినిమా తీసినా ఆ రేంజులోనే ఉండాలన్న కసి టాలీవుడ్ లో పెరిగింది. దర్శకనిర్మాతల్లో ఇది ఛాలెంజ్ గా మారింది.

తగ్గేదేలే! అంటూ బన్నీ – సుక్కూ టీమ్ కూడా ఇప్పుడు అన్నిటికీ తెగించేస్తోంది. దానికి తగ్గట్టే విజువల్ అప్ స్కేలింగ్ కోసం స్క్రిప్ట్ ను రివైజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది.కెజిఎఫ్ సీక్వెల్ రికార్డ్ బద్దలు కొట్టిన తర్వాత అమాంతం మారిన సన్నివేశమిది. ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్ ట్రాక్ లో ఆగిపోయింది. కొనసాగింపు ప్రయత్నాలు సాగడం లేదు ఇప్పటికి. దర్శకుడు సుకుమార్ కోరిక మేరకు విడుదల కోసం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘పుష్ప 2’ ఆగిపోయినట్లు నేషనల్ మీడియా ప్రచారం చేస్తోంది.తాజా సమాచారం మేరకు..

పుష్ప 2 మొదటి భాగం కంటే చాలా పెద్ద స్థాయిలో ప్లాన్ చేయాలనుకోవడం వల్లనే ఈ బ్రేక్ అని కూడా చెబుతున్నారు. మొదటి భాగం అంచనాలకు మించి విజయం సాధించడంతో బడ్జెట్ ను పెంచి యాక్షన్ సీక్వెన్స్ ని మరో లెవల్లో మెరుగుపరిచారు.కానీ ఇప్పుడు ‘KGF -చాప్టర్ 2’ సంచలన విజయం సాధించిన అన్ని పాత రికార్డులను బద్దలు కొట్టడంతో సుకుమార్ దీనిని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. అందుకే పుష్ప 2 స్క్రిప్టు కోసం మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నారు.

సూపర్ హీరో తరహా క్వాలిటీస్ తో యాక్షన్ పరంగా టచప్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నట్టు గుసగుస వేడెక్కించేస్తోంది.తాజా కథనాల ప్రకారం.. పుష్ప దర్శకుడు స్కేల్ అనుకున్నదానికంటే మరింత భారీగా ఉండాలని కోరుకుంటున్నారు. నిర్మాతలు రాజీకి వచ్చే ప్రసక్తే లేదని అంటుంటే బన్నీ కూడా తగ్గేదేలే అనేస్తున్నాడట. ఏది ఏమైనా ప్రస్తుతానికి షూటింగ్ ఆగిపోయిందని ప్రచారమవుతోంది.అంతేకాదు పుష్ప 1 సమయంలో పార్ట్ 2 కి సంబంధించిన కొంత షూట్ సాగిందన్న ప్రచారం నడుమ ఇప్పటి మార్పులు ఎలా ఉంటాయో నన్న ఆసక్తి కూడా నెలకొంది.

ప్రస్తుతానికి పుష్ప 2 మరొకమారు ‘స్క్రిప్ట్ విజువల్ అప్ స్కేలింగ్’ కు వెళ్లే క్రమంలో.. హీరో అల్లు అర్జున్ ఇప్పుడు మరొక చిత్రం షూటింగ్ ని ప్రారంభించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అది ఐకాన్ అవుతుందా కాదా? అన్నది బన్నీనే చెప్పాల్సి ఉంది మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*