కొరటాలను ఓ కోరిక కోరిన కొమరంభీమ్..

ntr next movie update

పెద్ద సినిమాలలో ఏ సినిమా సక్సెస్ సాధించినా ఆ క్రెడిట్ హీరోలకు సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ క్రెడిట్ దర్శకులకు వెళుతుంది.ఆచార్య సినిమాకు నెగిటివ్ టాక్ రాగా దర్శకుడు కొరటాల శివను ట్రోలర్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.చిరంజీవి, చరణ్ లాంటి టాలెంటెడ్ హీరోలు డేట్స్ ఇస్తే వచ్చిన అవకాశాన్ని కొరటాల సద్వినియోగం చేసుకోలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.శివ మాట్లాడుతూ “హానెస్ట్ గా చెబుతున్నా. నేను డైరెక్షన్ చేయలేదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి, పూజా హెగ్డే ముందు కొరటాల శివ స్వయంగా ఈ కామెంట్లు చేశారు.చిరంజీవి, రామ్ చరణ్ సీన్లు చేసుకుంటూ పోయారని తాను దర్శకుడిగా రిలాక్స్ అయ్యానని కొరటాల శివ చెప్పుకొచ్చారు.అయితే చిరంజీవి మాత్రం కొరటాల శివ చెప్పింది నిజం కాదని దర్శకుడిగా కొరటాల శివకు ఏం కావాలో అదే డెలివరీ చేశామని వెల్లడించారు.కొరటాల శివ అభిమానులు ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.అయితే ఆచార్య రిజల్ట్ తర్వాత కొరటాల శివ ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి సంప్రదించలేదు.

కొరటాల శివ సినిమా ఫలితంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.అయితే ఆచార్య ఫ్లాప్ అయినా ఎన్టీఆర్ సినిమా మాత్రం హిట్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్ గతంలో పలువురు ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాలను ఇవ్వగా ఆ డైరెక్టర్లు ఎన్టీఆర్ తో తెరకెక్కించిన సినిమాల ద్వారా విజయాలను అందుకున్నారు.ఈ సినిమా విషయంలో కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని తారక్ అభిమానులు భావిస్తున్నారు.

అయితే ఆచార్య‌` ఫ‌లితం నుంచి బ‌య‌ట‌ప‌డి.. ఎన్టీఆర్ సినిమా ప‌నుల్లో మునిగిపోయారు కొర‌టాల‌. ప్ర‌స్తుతం ఆయ‌న ఫోక‌స్ అంతా.. ఎన్టీఆర్ సినిమాపైనే ఉంది. ఈ నేప‌థ్యంలో.. కొర‌టాల‌కు ఎన్టీఆర్ కో స‌ల‌హా ఇచ్చాడ‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. `గ‌త సినిమాల ఫ‌లితాల గురించి ఆలోచించ‌కు… మ‌న క‌థ‌మీదే ఫోక‌స్ పెట్టు.. కావాలంటే.. ఇంకొంచెం టైమ్ తీసుకో..` అని చెప్పాడ‌ట‌.

అంతే కాదు.. కొర‌టాల ట్విట్ట‌ర్ లో యాక్టీవ్ గా లేరు. ఆయ‌న‌కు ట్విట్ట‌ర్ ఎకౌంట్ ఉన్నా, `ఆచార్య‌` స‌మ‌యంలో అందులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇప్పుడు కొర‌టాల‌ను మ‌ళ్లీ ట్విట్ట‌ర్‌లోకి ర‌మ్మ‌ని ఎన్టీఆర్ స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. త‌మ కాంబోలో సినిమా గురించి అప్‌డేట్స్ ఇవ్వ‌డానికీ, ఫ్యాన్స్‌తో ట‌చ్‌లో ఉండ‌డానికీ, సినిమాల‌పై వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవ‌డానికీ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఉప‌యోప‌గ‌డుతుంద‌ని, ఫ్యాన్స్‌కి ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ ఇవ్వ‌క‌పోతే.. వాళ్లు అసంతృప్తికి లోన‌వుతార‌ని, అందుకే ట్విట్ట‌ర్‌లో మ‌ళ్లీ యాక్టీవ్ కావాల‌ని ఎన్టీఆర్ కోరాడ‌ట‌. సో.. కొర‌టాల మ‌ళ్లీ ట్విట్ట‌ర్‌లోకి రావ‌డం దాదాపుగా ఖాయ‌మ‌న్న‌మాట‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*