ఆచార్య అనంతరం దర్శకుడికి హిట్టు గ్యారెంటీ.. మరో పవర్ఫుల్ సెంటిమెంట్!

Koratala Will Gets Hit With NTR 30 Movie

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ అనేవి ఎంత బలంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమంది అయితే ఒక్కసారి సెంటిమెంట్ ఉపయోగించి సక్సెస్ సాధిస్తే మాత్రం మళ్లీ అదే తరహా సెంటిమెంటును కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా కొన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ ను కూడా చాలా దూరం పెడుతూ ఉంటారు. అయితే ఆచార్య సినిమా దాదాపు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో కొరటాల శివ తర్వాత సినిమాతో మాత్రం తప్పకుండా సక్సెస్ అందుకుంటాడు అని ఒక సెంటిమెంట్ పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి…మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక మహేష్ బాబు తో మరోసారి చేసిన భరత్ అనే నేను సినిమా కూడా ఘన విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత మహేష్ బాబుతో మరో సినిమా కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.వరుసగా నాలుగు సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న కొరటాల శివ మొదటిసారి ఆచార్య సినిమాతో తడబడ్డాడు.

ఈ సినిమా మొదటి రోజే నెగిటివ్ అందుకోవడంతో ఆదివారం తర్వాత కలెక్షన్స్ రావడం కష్టమే అని అనిపిస్తోంది. ఈ సినిమా మొదటి రోజు చాలా తక్కువ కలెక్షన్స్ రాబట్టడం కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాకోసం మొత్తంగా నాలుగేళ్ల సమయాన్ని వెచ్చించాడు. ఫైనల్ గా ఆ సినిమా విడుదల కావడంతో ఈ దర్శకుడు తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టబోతున్నాడు. శివ, జూనియర్ ఎన్టీఆర్ తో ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా కథను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. తన సినీ జీవితంలోనే అది అత్యంత పెద్ద కాన్వాస్ ఉన్నా సినిమా కథ అవుతుంది అని వివరణ ఇచ్చాడు.అయితే కొరటాలశివ ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ కూడా తదుపరి సినిమాకు మాత్రం తప్పకుండా సక్సెస్ అందుకుంటాడు అని సోషల్ మీడియాలో ఒక సెంటిమెంట్ బలంగా కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు డిజాస్టర్ అందుకున్న దర్శకులు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఏదైనా సినిమా చేశారు అంటే తప్పకుండా సక్సెస్ కొడతారు అనే సెంటిమెంట్ అయితే కొనసాగుతోంది.

దర్శకుడు పూరి జగన్నాథ్ వరుస అపజయాలతో కొనసాగుతున్న సమయంలో ఎన్టీఆర్ తో టెంపర్ అనే సినిమా చేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. ఆ తర్వాత సుకుమార్ నేనొక్కడినే సినిమాతో ఊహించని పరాబావాన్ని ఎదుర్కొన్న అనంతరం ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో సినిమా మంచి బూస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే యువ దర్శకుడు బాబీ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అనంతరం ఎన్టీఆర్ తో జై లవకుశ అనే సినిమా చేసే ఫామ్ లోకి వచ్చేశాడు. ఇక త్రివిక్రమ్ అజ్ఞాతవాసి అనంతరం ఎన్టీఆర్ తో అరవింద సమేత చేసి హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కొరటాల శివ కూడా అదే తరహాలో సక్సెస్ కొట్టడం కాయమని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*