
సినిమా, సెట్స్ పైకి వెళ్లి చాలాకాలమే అవుతుంది. కరోనా కారణంగా కొన్నాళ్లు .. ముందుగా ‘భీమ్లా నాయక్’ను పూర్తి చేయాలనే పవన్ నిర్ణయం కారణంగా కొన్నాళ్లు ‘వీరమల్లు’ షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. రీసెంట్ గా మళ్లీ ఈ సినిమా షూటింగు మొదలైంది.
ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, మిగతా 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకోవలసి ఉంది. ఈ సినిమా కోసం భారీ సెట్లను వేయించారు. కొన్ని మైదానాలను సిద్ధం చేశారు. ఈ లొకేషన్లలో నాన్ స్టాప్ గా షూటింగును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రకారమే అన్ని పనులు జరుగుతున్నాయి.
అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ ‘దసరా’కి .. లేదంటే ‘సంక్రాంతి’కి రిలీజ్ చేయాలనే ఒక నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అందాల సందడి చేయనుంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.
Leave a Reply