కామెడీతో F3 ట్రైలర్.. ఫ్యామిలీ డైలాగ్‌లతో రచ్చ

f3 movie trailer

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో, అభిరుచిలో వైవిధ్యం కనిపిస్తోంది. ఫలితంగా కొత్తగా వస్తున్న ప్రయోగాత్మక చిత్రాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. దీంతో దర్శక నిర్మాతలు, హీరోలు కూడా విభిన్నమైన సినిమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంత కాలంగా టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా కొన్నేళ్ల క్రితం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ మల్టీస్టారర్ మూవీనే ‘F2′ (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఒకటి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు వర్షం కురిపించింది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్ అయింది.F2’ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీనికి సీక్వెల్‌గా F3 ని రూపొందించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిపోయింది. అయితే, దర్శకుడు అనిల్ రావిపూడి వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో ఇది కాస్తా ఆలస్యం అయింది. ఇక, చాలా గ్యాప్ తర్వాత F3 పేరిట ఈ సినిమాను రెండేళ్ల క్రితమే ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా వెంటనే ప్రారంభించారు. అయితే, మధ్యలో అనుకోని ఆటంకాలు ఎదురు కావడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే జరిగిన స్పెషల్ సాంగ్‌తో ఈ సినిమా షూటింగ్ భాగం మొత్తాన్ని పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా ప్రారంభించారు.

క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న F3 లో ముగ్గురు హీరోలు నటిస్తారని ఆరంభం నుంచే వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో ఇద్దరే నటిస్తారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మొదటి భాగాన్ని పెళ్లి వల్ల వచ్చే కష్టాలతో తెరకెక్కించగా.. దీన్ని మాత్రం మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో రూపొందించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక, ఈ సినిమాలో మరింత ఫన్ క్రియేట్ చేసేందుకు సునీల్, సోనాల్ చౌహాన్ కూడా తీసుకొచ్చి వాళ్లకు స్పెషల్ క్యారెక్టర్లు రాసుకున్నారు. అలాగే, మరెన్నో హైలైట్ పాయింట్లను కూడా ఈ సినిమాలో జత చేశారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. F3 మూవీని మే 27న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు.

మనీ వల్ల వచ్చే ఫ్రస్టేషన్స్ ఎలా ఉంటాయని మురళీ శర్మ చెప్పే డైలాగ్‌తో దీన్ని మొదలు పెట్టారు. ఇందులో వెంకటేష్‌ను రేచీకటి ఉన్న వ్యక్తిగా.. వరుణ్ తేజ్‌ను సరిగా మాట్లాడలేని యువకుడిగా చూపించారు. ఇక, ఇందులో ‘వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే.. మాది దగ్గుబాటి ఫ్యామిలీ’ అని వెంకీ డైలాగ్ చెప్పగా.. ‘వాళ్లది దగా ఫ్యామిలీ అయితే.. మాది మెగా ఫ్యామిలీ’ అంటూ వరుణ్ పలకడం హైలైట్‌గా నిలిచింది. ఇవి మాత్రమే కాదు.. ఇందులో పొట్ట చెక్కలయ్యే ఎన్నో డైలాగ్‌లు, సన్నివేశాలను కూడా చూపించారు. దీంతో ఇది వైరల్ అయిపోయింది. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వస్తున చిత్రమే ‘F3’. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇప్పుడు సునీల్, సోనాల్ చౌహాన్ కూడా ఇందులో భాగం అయ్యారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్నాడు. ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*