వచ్చారండి సమ్మర్ సోగ్గాళ్ళు….

F3 Movie Trailer Release Date

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 3’. సూపర్ హిట్ చిత్రం ‘ఎఫ్ 2’ కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా.. మొదటి భాగంలోని పాత్రలతోనే .. వేరే కథతో రూపొందుతోంది. డబ్బు చుట్టూ తిరిగే కథతో ఈ భాగం నవ్వులు పూయించనుంది.

తమన్నా, మెహ్రిన్ కథానాయికలుగా కంటిన్యూ అవుతుండగా.. సునీల్ పాత్ర అదనంగా చేరుతోంది. మొదటి భాగాన్ని మించిన స్థాయిలో ఇందులోని కామెడీని వర్కవుట్ చేశాడట దర్శకుడు. ఇటీవలే టాకీ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో ‘ఎఫ్ 3’ ట్రైలర్ ను ఈ నెల 9న విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మేకర్స్. సమ్మర్ సోగ్గాళ్లు’ అనే ట్యాగ్ లైన్ తో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా వెంకీ, వరుణ్ ఖాతాలో ష్యూర్ షాట్ హిట్‌గా నమోదవుతుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ ప్రత్యేకగీతంలో నర్తిస్తోంది. త్వరలోనే ఈ పాట లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఎఫ్ 3 చిత్రం ఏ స్థాయి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*