అది మాకు చెప్పకుండా తీశారు… కొరటాలపై రామ్ చరణ్ కామెంట్స్

Ramchacharan Comments On Koratala Shiva About Acharya Shooting

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఆచార్య నేడు విడుదలైంది. తాజాగా రామ్ చరణ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. మూవీ లో అందరికీ నచ్చిన ఓ షాట్ ఉంటుంది. చివర్లో ఉండే ఆ షాట్‌కు ప్రతీ ఒక్క ప్రేక్షకుడూ ఫిదా అయి ఉంటాడు. చివర్లో వచ్చే చిరుత పులి, పులి షాట్.. చిరంజీవి, రామ్ చరణ్ షాట్‌కు అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ సీన్ గురించి తాజాగా రామ్ చరణ్ చెప్పాడు. అసలు అలాంటి ఓ సీన్ తీయబోతోన్నాడని కొరటాల శివ ముందుగా చెప్పనేలేదట. ప్యాకప్ చెప్పి వేళ్లే చివరి క్షణంలో ఓ షాట్ ఉందని కొరటాల చెప్పాడట. కాలువ దగ్గర మీరు అలా వాటర్ తాగుతూ ఉండండి.. చిరంజీవి గారు అలా చుట్టూ చూస్తారని చెప్పాడట. యంగర్ కామ్రెడ్ వాటర్ తాగుతుంటే.. అలా సీనియర్ కామ్రెడ్ చుట్టూ చూస్తుంటాడు.. చుట్టూ అడవి కాబట్టి ఏదైనా డేంజర్ ఉంటుందేమోనని అందుకే అలా చూస్తాడేమోనని నేను అనుకున్నానంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

అయితే కెమెరా అలా పక్క నుంచి మా మీదకు వస్తుండటంతో చిరంజీవి అడిగాడట. అలా ఎందుకు కెమెరా అక్కడి నుంచి వస్తోంది.. ఏమైనా డేంజర్ ఉందా? అక్కడ అని కొరటాలను అడిగాడట చిరు. కానీ కొరటాల ఏమీ చెప్పలేదట. మొత్తానికి ఆ షాట్ అయిపోయివడంతో ప్యాకప్ చెప్పి వెళ్లిపోయారట. చివర్లో అసలు విషయం చెప్పాడట. మీకు ముందు.. చిరుత పులి, చిరుత ఉంటుందని చెప్పడంతో చిరంజీవి, రామ్ చరణ్ ఆశ్చర్యపోయారట. మొత్తంగా ఆ షాట్‌ను పదిహేను నిమిషాల్లో తీసేశారట. ఆ షాటే తనకు ఇష్టమని రామ్ చరణ్ పేర్కొన్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*