బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు పెట్టారు

Prabhas Name Updates Royal Bengal Tiger Named as Prabhas

ప్రభాస్ ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా ఓ సంచలనం . ఏమంటూ బాహుబలి సినిమాలో నటించారో కానీ ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది . ఈ ఒక్క సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నారు . ఇప్పుడు ప్రభాస్ నుంచి ఓ సినిమా వస్తుందంటే అది నేషనల్ న్యూస్ గా మారిపోతోంది. ప్రభాస్ డేట్స్ కోసం బాలీవుడ్ సైతం ఎగబాటుతున్నారంటే, డార్లింగ్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల వచ్చిన రాధేశ్యామ్ మాస్ ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిందని అభిప్రాయాలు వ్యక్తమైనా .. ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు కదా మరింత పెరిగింది . దీనికి నిదర్శనమే తాజాగా హైదరాబాద్ లోని నెహ్రు జులాజికల్ పార్క్ అధికారులు తీసుకున్న నిర్ణయం .

వివరాల్లోకి వెళితే … జూపార్క్ అధికారులు బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు పెట్టారు .

సాధారణంగా సినిమాల్లో హీరోలను పులి,సింహాలతో పోలుస్తుంటారు. అయితే జూ నిర్వాహకులు ఏకంగా పులికే ప్రభాస్ పేరు పెట్టడంతో డార్లింగ్ ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. తుమ్మల రచన చౌదరి అనే మహిళా దత్తత తీసుకున్న బెంగాల్ టైగర్ కు బ్రాకెట్లో ప్రభాస్ అని రాసుకున్న పోస్టర్ను సదరు టైగర్ ఉన్న చోట ఏర్పాటు చేసారు అధికారులు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టర్ కు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది . అయితే ఇలా జంతువులకు మనుషుల పేర్లు పెట్టడం ఇదే తొలిసారి కాదు గతంలోను పార్క్ లో కొన్ని జంతువులకు వ్యక్తుల పేర్లను నామకరణం చేసిన సంఘఠనలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పుడీ వార్త నెట్టింట సందడి చేస్తుంది .

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆదిపురుష్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నా యంగ్ రెబల్ స్టార్ . నాగ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే, ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సాలార్, సందీప్ వంగతో స్పిరిట్, మారుతి దర్శకత్వంలో ఇలా చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*