కేక పెట్టించిన అల్లం అర్జున్ కళ్యాణం..

Ashoka vanam lo arjuna kalyanam Public Talk

చేసింది తక్కువ సినిమాలే అయినా.. అప్పుడే మాస్ కా దాస్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. హీరోగా తన కెరీర్ ప్రారంభమయినప్పటి నుండి విశ్వక్ సేన్ ఎక్కువగా రఫ్ క్యారెక్టర్స్‌లోనే కనిపించాడు. కానీ చాలాకాలం తర్వాత ఓ క్లాస్ లుక్‌లో అలరిస్తూ.. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో మన ముందుకు వచ్చేశాడు. మరి అర్జున కళ్యాణం బాగా జరిగిందా? అతిధులకు నచ్చిందా?
అశోకవనంలో అర్జున కళ్యాణం’ శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది.

ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్‌లో చూపించినట్టుగానే 30 ఏళ్లు పైబడిన అల్లం అర్జున్ కుమార్‌కు పెళ్లి.. అనే కాన్సెప్ట్ చుట్టూనే సినిమా తిరుగుతుంది. కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే చిన్న ట్విస్ట్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’కు స్పెషల్ టచ్ ఇస్తుంది.

దర్శకుడు విద్యాసాగర్ చింతకు ఈ సినిమా డెబ్యూ అయినా కూడా క్యారెక్టర్లను మ్యానేజ్ చేయడంలో .. కథ బోర్ కొట్టకుండా కామెడీ సీన్స్ యాడ్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక విశ్వక్‌కు జోడీగా నటించిన రుక్సార్ ధిల్లాన్ కూడా స్క్రీన్‌పై కనిపించినంతసేపు చాలా క్యూట్‌గా యాక్ట్ చేసింది. ఇక ఫస్ట్ హాఫ్‌తో పోలీస్తే సెకండ్ హాఫ్ సినిమాకు పెద్ద ప్లస్. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఒక క్లీన్ ఫ్యామిలీ సినిమా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*