ఫేమస్ షో‌తో Bollywood లో పాగా వేసే దిశగా Allu Arjun…

allu arjun talks with sanjay leela bansali

బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కీలక ప్రకటన చేశాడు. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘కాఫీ విత్ కరణ్’ చాట్ షో ముగిసిందని తెలిపాడు. కొన్ని గంటల అనంతరం సోషల్ మీడియాలో మరో మెసేజ్ షేర్ చేశాడు. ఓటీటీ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+హాట్ స్టార్’ లో ‘కాఫీ విత్ కరణ్- 7’వ సీజన్ స్ట్రీమింగ్ కాబోతుందని పేర్కొన్నాడు. ఈ షోలో ఫస్ట్ గెస్టులుగా రణ్‌వీర్ సింగ్ ఆలియా భట్ పాల్గొనబోతున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ లో రణ్ వీర్, ఆలియా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్లను చాట్ షోతోనే ప్రారంభింబోతున్నారని వినికిడి. సౌతిండియన్ సెలబ్రిటీలు కూడా ‘కాఫీ విత్ కరణ్- 7’ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది.

‘పుష్ప: ది రైజ్’ సినిమాతో అభిమానులను అలరించిన అల్లు అర్జున్ , రష్మిక మందన్న ఈ షోలో పాల్గొనబోతున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా బాలీవుడ్‌లో భారీస్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. దాదాపుగా రూ. 100కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు బన్నీ, రష్మిక ఇద్దరికీ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ‘కాఫీ విత్ కరణ్-7’ మేకర్స్ వీరిద్దరని ఈ షోకీ ఆహ్వానించారని తెలుస్తోంది. ఈ చాట్ షోలో పాల్గొంటే ‘పుష్ప: 2’ కు ప్రచారం లభిస్తుందని అల్లు అర్జున్ భావిస్తున్నాడట. ఉత్తరాది ప్రేక్షకులకు కూడా చేరువ కావొచ్చనే అభిప్రాయంలో అతడు ఉన్నాడని సమాచారం. అందువల్ల ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే బన్నీ అంగీకరించడని బీ టౌన్ మీడియా తెలుపుతోంది.

రష్మిక మందన్న కూడా హీరోయిన్‌గా బాలీవుడ్‌కీ ఎంట్రీ ఇస్తుంది. ఆమె నటించిన చిత్రాల షూటింగ్ కూడా ముగిసింది. ‘కాఫీ విత్ కరణ్-7’లో పాల్గొంటే సినిమాల విడుదలకు ముందే కొంతైనా ప్రచారం లభిస్తుందని ఆమె భావిస్తోంది. ఫలితంగా ఆమె కూడా తన అంగీకారం తెలిపిందని బీ టౌన్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కరణ్ జోహార్ అంతకు ముందు ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఈ షో స్ట్రీమింగ్ అవుతుందని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ షేర్ చేశాడు. ‘‘ప్రతి గొప్ప కథకు ఓ మంచి ట్విస్ట్ తప్పక ఉండాలి. ‘కాఫీ విత్ కరణ్’ తిరిగి టీవీలో ప్రసారం కాదు. ఈ చాట్ షో 7వ సీజన్ ‘డిస్నీ+హాట్ స్టార్‌’ లో ప్రసారం కానుంది. భారత్‌కు చెందిన బడా నటీ, నటులందరు కాఫీ తాగుతూ ఈ షోలో పాల్గొనబోతున్నారు. వదంతులకు చెక్ పెట్టి లోతైన చర్చలను జరపడానికి ఈ షో సిద్ధంగా ఉంది’’ అని ట్విట్టర్‌లో కరణ్ పోస్ట్ పెట్టాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*