అక్షయ తృతీయ రోజు ఈ మూడు దానం చేస్తే ధనవంతులు అవ్వటం ఖాయం.

Akshaya Tritiya 2022

వైశాఖ శుద్ధ తృతీయ అనేది అక్షయ తృతీయ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.ఈ రోజుకు భారతదేశంలో చాలా ప్రాధాన్యం ఉంది.అయితే ప్రాంతాన్ని బట్టి ఆచరించే విధానం మారుతుంది.వైశాఖ మాసం చాలా ప్రశస్తమైనది.వైశాఖ మాసం ప్రారంభం అయిన మూడో రోజే అక్షయ తృతీయ వస్తుంది.ఈ తృతీయ నాడు ఇచ్చే దానాలను అక్షయాన్ని ఇస్తాయి.అందుకే అక్షయ తృతీయ కొనుక్కోవటానికో, తెచ్చుకోవటానికో కాదు ఇవ్వటానికి మాత్రమే అని తెలుసుకోవాలి.అక్షయ తృతీయ రోజు దానం ఇస్తే గ్రహ దోషాలు,పూర్వ కర్మ ఫలితాలు తొలగిపోతాయి.ప్రాప్తిని కలిగిస్తుంది.

అక్షయ తృతీయ రోజున జపం,హోమం,పితృ తర్పణం,దానం గాని చేస్తే అక్షయ ఫలితం లభిస్తుంది. ఈ రోజున ఏమి చేసిన అక్షయ ఫలితం లభిస్తుంది.అందువల్ల అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.నిత్యం భగవంతుని ఆరాధనలో ఉండే వారికీ దానం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి.

దానాలను వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి.అంటే వేసవి తాపాన్ని తగ్గించే విసనకర్ర,గొడుగు,పాదరక్షలతో పాటు దశ దానాలు కూడా శక్తి కొలది ఇవ్వవచ్చు.అలాగే ఈ రోజు ఏ పూజ చేసిన అధిక ఫలాన్ని ఇస్తుంది.ఈరోజు పితృ తర్పణం చేస్తే పితృలకు అక్షయ పుణ్య ఫలాలు లభిస్తాయి.అలాగే పితృ తర్పణం విడిచే కొడుకులకు పితృ దేవతల అనుగ్రహం, దేవతల అనుగ్రహంలభిస్తుంది.నీటి కడవను దానం చేస్తే పితృలకు అక్షయ లోకాలను ఇవ్వటమే కాకుండా దానం చేసిన వారికి కూడా శాంతిని కలిగిస్తుంది.ఈ రోజు సముద్ర స్నానం చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.ఈ రోజు ఉపవాసం చేసిన అక్షయ ఫలితం ఇస్తాయి.అక్షయ తృతీయ రోజు పగలు కానీ రాత్రి గాని అమ్మవారిని ఆరాదిస్తే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*