ముగ్గురు అన్నలు కలిసి NTR కోసం పెద్ద ప్లాన్.కానీ ఇంతలోనే NTR కి ఆక్సిడెంట్ | Flash Back Of NTR | NTR

Adhur Movie Flah Back

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్ని సినిమాలున్నా కూడా ఆది మాత్రం ప్రత్యేకమే. ఎందుకంటే ఈయనకు మాస్ హీరోగా సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఇది. 20 ఏళ్ల వయసులోనే సూపర్ స్టార్‌గా మారడానికి బీజం వేసిన సినిమా ఇది. 2002లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాదు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు కూడా తిరగరాసింది. వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై 18 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఆది సినిమా గురించి మాట్లాడుతుంటారు. దానికి కారణం వినాయక్ టేకింగ్. అప్పటికి ఎలాంటి ఇమేజ్ లేని ఎన్టీఆర్‌ను స్టార్ హీరోగా మార్చేసాడు ఈయన.ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు ఎన్టీఆర్‌కు ఓ ప్రమాదం జరిగింది.
క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఎమోషన్‌తో సీన్‌లో మరింత ఇన్‌వాల్వ్ కావడంతో చేతికి దెబ్బ తగిలింది.
అసలేం జరిగిందంటే ఆది షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ చేతికి అనుకోకుండా గాయమైంది. ముందు అది చిన్నదే అనుకున్నారంతా. అయినా కూడా వినాయక్ రిస్క్ తీసుకోలేదు. పైగా ఎన్టీఆర్ అప్పటికి కుర్రాడంతే.ఆవేశంలో ఫైట్ సీన్ చేసాడు.. అది కాస్తా కట్ అయిపోయింది. చేతికి రక్తం కారిపోతుంది.. అయినా కూడా షూటింగ్ పూర్తి చేసిన తర్వాతే హాస్పిటల్‌కు వచ్చారట ఎన్టీఆర్.అక్కడ డాక్టర్ ఎన్టీఆర్‌ను చూసి నరం కట్ అయిందని.. ఏదైనా తేడా కొడితే ప్రాణాలు పోయేవని చెప్పాడు. దాంతో అందరికీ భయం వేసిందని.. ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అనే వణుకు పుట్టిందట డైరెక్టర్ వినాయక్ కి .ఆది తర్వాత వీళ్ళ కాంబినేషన్‌లో సాంబ, అదుర్స్ సినిమాలు వచ్చాయి.
ఆది సినిమా లో ఇలా జరిగితే ఇక అదుర్స్ సినిమా విషయానికి వస్తే…కొన్ని సార్లు వెతక బోయిన తీగ కాలికి తగులుతుంది. కొన్ని సార్లు వెతికి వెతికి దొరకబుచ్చుకున్న తీగ మెడకు చుట్టుకుంటుంది. కానీ అది బంగారపు తీగ అయితే…
అదుర్స్ సినిమా వెనుక అంత కధ జరిగింది.

 

ఎన్టీఆర్ కి బ్లడ్ రిలేషన్ లేని అన్నలు ముగ్గురు. మొదటి అన్న కొడాలి నాని. ఎన్టీఆర్ కి మొదటినుంచి అండాదండా. ఎన్టీఆర్ స్టార్ హీరో అవుతాడని మొదటినుంచి నమ్మిన వ్యక్తి. ఇలా చెప్పాలి అంటే ఎన్టీఆర్ కోసం ప్రాణం ఇచ్చేసేవాడు. పొలిటికల్ బాక్గ్రౌండ్ వున్నవాడు. కానీ సినిమాలంటే చాల ఇంట్రెస్ట్. కృష్ణ జిల్లాలో సినిమాలకు డిస్ట్రిబ్యూట్ చేసాడు. ఎన్టీఆర్ తో సాంబ సినిమా ప్రొడ్యూస్ చేసాడు కూడా. ఇంకా రెండో అన్న వల్లభనేని వంశి … పెద్ద ఎన్టీఆర్ కి చిన్న ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఇక మూడో అన్న vv వినాయక్. ఆది తో ఎన్టీఆర్ ని స్టార్ హీరో ని చేసి అతి దగ్గర మనిషి అయిపోయాడు. ఈ ముగ్గురు అన్నలతో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. అది ఎలా ఉండాలి అంటే కొండలను పిండి చేయకూడదు. కానీ బంగారు కొండ లా ఉండాలి. టాటా సుమోలు బాంబ్ బ్లాస్ట్ లు , రక్త పాతాలు ఇవన్నీ కనపడకూడదు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాలి. experimneter ఉండాలి. బట్ కమెర్షియల్ వర్కౌట్ కావలి. ఎన్టీఆర్ కి అస్సలు damage కాకూడదు. మాస్, యాక్షన్ చట్రం నుంచి ఎన్టీఆర్ ని బయటకు తీసుకురావాలి. అలాంటి కథ కావాలి. నెల, రెండు, మూడు , నాలుగు నెలలు ఇలా నెలలు గడిచిపోతున్నాయి. 2002 లో వినాయక్ కంబినేషన్ లో ఆది సినిమా వచ్చింది. ఆ తరువాత 2004 లో సాంబా… ఇప్పుడు చేస్తున్న కథ అంతకు మించిఉండాలి.. అప్పుడు దుర్గయ్య అనే ఒక కథ అనుకున్నారు కానీ అది పనికి రాలేదు, ఆ తరువాత డైరెక్టర్ దశరద్. వినాయక్ కి చాలా క్లోజ్ .. ఇద్దరు ఆల్మోస్ట్ రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు. ఆలా మాటల సందర్భం లో ఒక రోజు ధశరద్ వినాయక్ కి సరదాగా ఒక కథ చెప్పాడు. అది వినాయక్ కి బాగా నచ్చింది. అది పోలీస్ కథ. ఈ కథ ఎన్టీఆర్ కి అయితే బాగుంటుంది కథ ఇచ్చేస్తావా అని అడిగారు వినాయక్… దశరద్ ని .. ఓకే అన్నారు… దశరద్. ఇద్దరు కలసి కూర్చొని ఒక వెర్షన్ రెడీ చేసారు. Fainally Not Satisfied . ఆ తరువాత మస్కా రైటర్ సూర్య ఒక లైన్ తీసుకు వచ్చాడు. అందులో హీరో ఒక కాలేజ్ స్టూడెంట్ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగాలేదు. ఇక అదికూడా వద్దు అనుకున్నారు. వినాయక్ ఎన్టీఆర్ కోసం కథ ల మీద కథలు వింటూనే ఉన్నాడు. తన బుర్ర బద్దలైపోతుంది. మరో వైపు ఎన్టీఆర్ డేట్స్ దగ్గర పడుతున్నాయి. వినాయక్ కి టెన్షన్ స్టార్ట్ అలా అని ఏది పడితే అది చేయకూడదు. అలా కథల కోసాంవేటాడుతుండగా రైటర్ కోన వెంకట్ ని కలిసారు ఒక రోజు. ఆటను నిలబెట్టి కథ మీద కథలు చెప్పేయగల సమర్ధుడు అయితే ఆ రోజు సరదాగా ఓ డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ చెప్పాడు. ఒకడు క్లాస్, మరొకడు మాస్. కవలలుగా పుట్టి విడివిడిగా పెరుగుతారు. ఒకడు పిరికివాడు, మరొకడు ధైర్యవంతుడు. వెళ్లపాలిట ఒక కామెడి డాన్. ఇద్దరు కలిసి అతని భరతం పట్టించటం కథ. వినాయక్ వెంటనే కనెక్ట్ అయిపోయాడు. ఇందులో పిరికి వాడు పూజారి అయితే బాగుంటుంది ఏమో ఆలోచించండి అని వినాయక్ సజెస్ట్ చేసాడు.
ఇక కోన వెంకట్ రెచ్చిపోయాడు. సింహాచలం లో ఒక పూజారి గారి అబ్బాయి తనకి గుర్తువచ్చాడు. అతని ఇన్స్పిరేషన్ తో చారి క్యారెక్టర్ ని రెడీ చేసాడు.అంతా హ్యాపీ ఎన్టీఆర్ కి డ్యూయల్ రోల్ బాగానే నచ్చేసింది.ఒకటి నరసింహ ఇది ఫుల్ సీరియస్ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ నరసింహ చారి.. ఫుల్ ఫన్ క్యారెక్టర్.

 

 

కోన వెంకట్ స్టార్టింగ్ లో తన స్లాంగ్ లో కథ నరేట్ చేస్తుంటే ఎన్టీఆర్ పడి పడి నవ్వేసాడంట. కానీ వినాయక్ కు ఎక్కడో చిన్న టెన్షన్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ని చారి పాత్రలో ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోగలరు అని. సర్లే అని ఒకసారి ఫోటో షూట్ అర్రెంజ్ చేసారు వినాయక్. అసలు ఎన్టీఆర్ చారి గెటప్ లో ఎలా ఉంటారో చూద్దాం అని … ఫైనల్లీ ఎన్టీఆర్ చారి గెటప్ రెడీ. ఎన్టీఆర్ ఆ గెటప్ లో చూడటానికి బలే వున్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ ఫైనల్ చేస్తే ఇక షూటింగ్ కి వెళ్లిపోవడమే. కోన వెంకట్ అదే పని మీద వున్నాడు. 1st వెర్షన్ 2nd వెర్షన్ అండ్ 3rd వెర్షన్ అన్ని రెడీ గా వున్నాయి బట్ సెకండ్ హాఫ్ బాగాలేదు. అయిన పర్లేదు రన్నింగ్ లో చేంజ్ చేసుకోవచ్చులే అనే ధీమా తో షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేసారు. ఇక హీరోయిన్లు విషయానికి వస్తే నయనతార ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే వినాయక్ తో 2 సినిమాలు చేసింది. లక్ష్మి అండ్ యోగి. ఇంక నరసింహ క్యారెక్టర్ హెరాయిన్ గా పరుగు లో చేసిన షీలాని ఎంపిక చేసారు. ఇక విలన్ పాత్ర విషయానికి వస్తే రెగ్యులర్ పేస్ ఉండకూడదు. డోన్ పాత్ర అయిన కామెడియన్ లో ఉండాలి. అనుకుండగానే దొరికారు.. మహేష్ మంజ్రేకర్. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ ఇతను. కాస్టింగ్ క్రూ అన్ని ఓకే. ప్రొడక్షన్ బాధ్యతలు నల్లమల బుజ్జికి అప్పగించారు. 2008 ఏప్రిల్ 23 న హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో ఫిల్మ్ ఓపెనింగ్. ఫస్ట్ డే షూటింగ్ చారి గెటప్ లో ఎన్టీఆర్ రెడీ. వినాయక్ టెంషన్గా వున్నాడు. బ్రహ్మానందం ఎన్టీఆర్ మధ్య ఒక సీన్ … చక్కెర తక్కువ అనే సీన్ తీయాలి. ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ కి అందరూ సెట్ లో పడి పడి నవ్వారట. దాంతో వినాయక్ కి కాంఫిడెన్స్ పెరిగిందట ఇక చారి క్యారెక్టర్ గురించి టెంషన్ లేదు. చారి ఎలా మాట్లాడాలి. body language ఎలా ఉండాలో కోన వెంకట్ జస్ట్ ఇన్పుట్స్ ఇస్తే ఎన్టీఆర్ ఆలా అల్లుకు పోయాడు అంట. చారి గా ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ చూసి వినాయక్ మురిసిపోయాడు. తానూ కోరుకున్నది కూడా అదే. ఇక సినిమా కి పేరు ఎం పెట్టాలి ? లవకుశ, డబుల్ ధమాకా, ఇలా చాలా పేర్లు అనుకున్న చివరికి అదుర్స్ అనే పేరు పెట్టారు. ఫస్ట్ హాఫ్ షూట్ హ్యాపీ గా ఫినిష్ చేసారు. కానీ సెకండ్ హాఫ్ చాలా సీరియస్ గా వెల్తూ ఉంది బట్ వినాయక్ ఫుల్ ఫన్ expect చేస్తున్నాడు ఈలోగా గోపి మోహన్ హెల్ప్ తో ఇంకో వెర్సన్ మొదలుపెట్టారు. పక్కాగా సెకండ్ హాఫ్ కూడా కుదిరిపోయింది. అంతా రెడీ… ఈ లోపు 2009 ఎలక్షన్ హడావిడి…. టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేయాల్సిన పరిస్థితి. ఇక ఎలక్షన్ ప్రచారం తో అదుర్స్ కి లాంగ్ బ్రేక్ After elections షెడ్యూల్ ప్లాన్ చేసారు.
యూనిట్ మొత్తం ఆ పనిమీదే ఉంది. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడు అన్నట్లు. సడన్ గా 2009 మర్చి 27 అర్ధరాత్రి టీవీ చానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్.. ప్రచారం పూర్తిచేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న ఎన్టీఆర్ కార్ కు ఆక్సిడెంట్. ఎన్టీఆర్ జస్ట్ మిస్ 5 ప్రక్కటెముకలు విరిగిపోయాయి.

 

ఆ సమయంలో వైద్యులు కనీసం ఏడాదిపాటు తారక్ ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచనలు చేశారు.అదే సమయంలో జూనియర్ ఎన్టీఅర్ డ్యాన్స్ కు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సూచనలు చేశారు. ఆలా బెడ్ పై పాడుకొనే వున్నాడు నించోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. అలా బెడ్ పైనే కడల లేని పరిస్థితి. ఎన్నాళ్ళు ఇలా. ఇంటికి తీసుకు వెళ్లిపోయారు. నరకం, దీనికి తోడు బయట gossips ఎన్టీఆర్ పని ఇక అవుట్ అని. ఇలాంటి మాటలు ఎన్టీఆర్ చెవిన పడుతూనే వున్నాయి. ఎన్టీఆర్ కసి ఉన్నోడు… తాను లేవాలి.. మునుపటిలా తానూ డాన్స్ చేయాలి… తనను కామెంట్ చేసేవాళ్ల నోరు మూయించాలి డాక్టర్స్ ఇచ్చే మందులు కన్నా… మనోబలమే ముఖ్యం అనినమ్మడు. అదే జరిగింది. డాక్టర్స్ చెప్పిన దానికన్నా ముందే లేచాడు. నించున్నాడు. తిరుగుతున్నాడు. వినాయక్ కి ఫోన్ కూడా చేసి షూటింగ్ పెట్టుకోండి. ఫస్ట్ క్లైమాక్స్ సీన్స్ చేసేద్దాం అని చెప్పాడట. ఆ మాట కి వినాయక్ షాక్ ఎమ్ మాట్లాడుతున్నావ్ అప్పుడే షూట్ ఏంటి ? ఇంకో 2 మంత్స్ రెస్ట్ తీసుకో ఇప్పుడు ఆఘమేఘాల మీద షూటింగ్ పూర్తిచేయాల్సిన అవసరం లేదు అని సర్దిచెప్పాడు. కానీ ఎన్టీఆర్ మొండి ఘట్టం వినలేదు. దాదాపు 6 నెలలు షూటింగ్ లేదు. అసలు అదుర్స్ షూటింగ్ ఇంక ఉంటుందా లేదా అని అనుకున్నారు అంతా.. ఈ లోపు కోన వెంకట్, వినాయక్ మాత్రం సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ మొత్తం రెడీచేసారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ సూపర్ గా రెడీ అయిపోయింది. ఈ సినిమాలో పాట కోసం బారి గా సెట్ వేశారు RFCలో. హీరోయిన్ హీరో తో పిల్లా నా వాళ్ళ కాదు పాటకి డాన్స్ చెయ్యాలి ఎన్టీఆర్ కి గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. కొరియోగ్రాఫర్ ప్రేమ్ భయం భయంగానే స్టెప్ వేసి ఆలా చూపించగానే. డైరెక్ట్ గా సెట్ లోకి వెళ్లి సింగల్ టేక్ లో చేసేసాడు.. ఎలా కదిలిపోయాడో గాని అలా స్టెప్స్ మీద స్టెప్స్ వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఒకవైపు పక్కటెముకుల్లో నొప్పి భరించలేకపోతున్నాడు. దానికి పెయిన్ కిల్లర్ వేసుకొని చేసేస్తున్నాడు. అయితే వినాయక్ తన కష్టాన్ని చూడలేక సెట్ లోకి రాలేక పోయాడు. బయటనే ఉంది పొయ్యాడు. చాలా టెన్షన్ పడిపోతూనే ఉన్నాడు. షూటింగ్ అప్పేద్దాం. అని చాలా గొడవచేసాడు వినాయక్. ఎందుకంటే ఎన్టీఆర్ భాదని వినాయక్ చూడలేక పోతున్నాడు. తనకు ఏమీ కాదని ఫ్యాన్స్ కోసం డ్యాన్స్ కూడా చెయ్యకపోతే ఎలా అని తారక్ వినాయక్ ను రివర్స్ లో ప్రశ్నించి డ్యాన్స్ చేశారు. అలా ఎన్టీఆర్ ఏ స్వయంగా వినాయక్ కి సర్దిచెప్పాల్సి వచ్చింది ఎన్నో అవాంతరాలు, మానసిక సంఘర్షణలు అధిరోహించి మొత్తానికి 2010 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కు సినిమాలపై ఉన్న డెడికేషన్ కు ఈ సంఘటన నిదర్శనమని చెప్పవచ్చు. అది పక్కన పెడితే ఎన్టీఆర్ అదరగొట్టేసాడు. చారి గెటప్ లో ఇరగదీసేసాడు.. చారి లాంగ్వేజ్ లో చెప్పాలంటే శాంతం అదరగోటేసాడు. ఇక భట్టు, చారి మధ్య conversations. ఆ సీన్స్ అయితే పగల బడి నవ్వాల్సిందే.. బట్టుగా బ్రహ్మానందం, చారి గా ఎన్టీఆర్ ఒకరికొకరు పోటీ పది నటించేసారు. ఎన్టీఆర్ లో యాక్టర్ ని యూ Dimention లో ఆవిష్కరించింది ఆ సినిమా. కష్టే ఫలి అన్న నానుడికి నిర్వచనం చెప్పిన డైనమిక్ హీరో జూనియర్ ఎన్టీఆర్…..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*